అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar App Launched: ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 నుంచి పాత mAadhaar యాప్‌కు బదులుగా కొత్త ఆధార్ యాప్ (Aadhaar App)ను ప్రోత్సహిస్తూ వినియోగదారులను కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్చుతోంది. ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సురక్షితంగా, పేపర్‌లెస్ విధానంలో అందించేందుకు ఈ కొత్త యాప్‌ను రూపొందించింది.
UIDAI వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త Aadhaar App ప్రారంభమైన ఐదు నెలల లోపే 3.1 కోట్లకు పైగా డౌన్లోడ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారులు వేగంగా ఈ యాప్‌ను స్వీకరిస్తున్నారని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 40 లక్షల మంది తమ మొబైల్ నంబర్లను యాప్ ద్వారా అప్డేట్ చేసుకోగా.. 8.5 లక్షల మంది చిరునామా మార్పులను పూర్తి చేశారు.
Also Read
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్:
కొత్త Aadhaar Appలో బాగా ఆకట్టుకునే అంశం ఏమిటంటే.. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించడం. దీంతో చిన్న మార్పుల కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
ఫేస్ ఆథెంటికేషన్:
ఈ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వినియోగదారులు తమ గుర్తింపును డిజిటల్ పద్ధతిలో ధృవీకరించుకోవచ్చు. ప్రతిసారి ఆధార్ ఫోటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా సేవలను పొందేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
QR కోడ్ ద్వారా ఆధార్ షేరింగ్:
కొత్త యాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ QR కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆధార్ కార్డు ఫోటోకాపీలను అందించాల్సి వచ్చేది. ఇకపై అవసరమైన వివరాలను మాత్రమే QR కోడ్ ద్వారా సురక్షితంగా పంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత సమాచారం అనవసరంగా ఇతరుల చేతికి చేరకుండా గోప్యత మరింత మెరుగుపడుతుంది.
Move to a smarter and better Aadhaar experience. The new Aadhaar App brings enhanced privacy, seamless verification and greater convenience – all at your fingertips.
Download the new Aadhaar App, today – https://t.co/X1ymzxksIZ #AadhaarApp #mAadhaarApp #Aadhaar… pic.twitter.com/aFNYQpH1rg— Aadhaar (@UIDAI) June 30, 2026
బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్:
ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ బయోమెట్రిక్ వివరాలను ఒకే క్లిక్‌తో లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. అదనంగా e-Aadhaar డౌన్లోడ్, ఆథెంటికేషన్ హిస్టరీ పరిశీలన, ఆధార్ సేవ కేంద్ర అపాయింట్మెంట్ బుకింగ్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హోటళ్లు, ఆస్పత్రుల్లో కూడా ఉపయోగం:
UIDAI ఈ యాప్‌ను కేవలం ఆధార్ నిర్వహణకే పరిమితం చేయకుండా రోజువారీ డిజిటల్ గుర్తింపు సాధనంగా అభివృద్ధి చేస్తోంది. హోటల్ చెక్-ఇన్లు, ఆస్పత్రి అడ్మిషన్లు, సందర్శకుల నిర్వహణ వ్యవస్థలు, ఈవెంట్ ఎంట్రీలు, గిగ్ వర్కర్లు, సేవా భాగస్వాముల ధృవీకరణ వంటి అనేక అవసరాలకు Offline Verification Seeking Entity (OVSE) QR కోడ్ స్కానింగ్ ద్వారా ఈ యాప్ ఉపయోగపడనుంది.
Use the Aadhaar App for correct identity verification and trusted entry into residential societies.
Download Aadhaar App now: https://t.co/X1ymzxjUTr #AadhaarApp #VisitorVerification #QuickAccess #UIDAI #SecureEntry #AadhaarServices pic.twitter.com/Zn7PuPCcgj
— Aadhaar (@UIDAI) July 1, 2026
తాజావార్తలు
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..