Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు హాజరుకానున్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విచారణకు హాజరయ్యేందుకు గతంలో రెండుసార్లు గడువు కోరిన ఆయన, తాజాగా విజయవాడలో మహిళా కమిషన్ ఎదుట తన వివరణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరారు గుడివాడ అమర్నాథ్, లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి కమిషన్ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై తనకు పూర్తి గౌరవం ఉందని, అందుకే మహిళా కమిషన్ విచారణకు హాజరవుతున్నానని చెప్పారు.
విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. హోం మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడా మహిళలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని పేర్కొన్నారు. అనితపై తాను చేసింది కేవలం రాజకీయ విమర్శ మాత్రమేనని, దానిని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ కృత్రిమ ఆందోళనలు చేపట్టిందని ఆరోపించారు. మహిళా కమిషన్ ఎదుట తన వాదనను బలంగా వినిపిస్తానని అమర్నాథ్ తెలిపారు. గతంలో హోం మంత్రి తనపై, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కమిషన్‌కు సమర్పించే అవకాశముందని సమాచారం.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
అదే సమయంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను కూడా అమర్నాథ్ ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని, సాయికృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపైనా మహిళా కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను మహిళలకు ఆపాదించే ప్రయత్నం చేసి టీడీపీ నాయకులు ప్రజల్లో హాస్యాస్పదంగా మారారని అమర్నాథ్ విమర్శించారు. మహిళా కమిషన్ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు