President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu Vizag Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఐఎన్ఎస్ డేగా ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి, అనంతరం నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లోని చోళ అతిథి గృహంలో బస చేయనున్నారు. ఆ తర్వాత బీచ్ రోడ్డులోని వీ కన్వెన్షన్‌కు చేరుకుని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ స్నాతకోత్సవంలో మొత్తం 373 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనుండగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. గవర్నర్, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకు చేరుకుని కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన షెడ్యూల్..
* ఉదయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న రాష్ట్రపతి భారత వాయుసేన ప్రత్యేక విమానం..
* మధ్యాహ్నం 12.35 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము..
* ఎయిర్‌పోర్టులో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న రాష్ట్రపతి..
* ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డుమార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి.
* మధ్యాహ్నం గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము..
* తిరిగి సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి..
* సాయంత్రం 4.30 గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు బయల్దేరనున్న రాష్ట్రపతి..
* బుధవారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంమండలం జంతులూరుకి ముర్ము..
* కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము..
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!