Visakhapatnam: విశాఖపట్నంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలని మద్యానికి పణంగా పెట్టాడు ఆటో డ్రైవర్.. మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది.