Megastar Chiranjeevi: టాలీవుడ్ సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి., చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన 46 ఏళ్ల సినీ జీవితంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా మెగాస్టార్ గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరిగింది.
Also Read: IFS Officer: డాక్టరును మోసం చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, భర్త.. రూ. 64 లక్షలు స్వాహా!
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవిని వారు అభినందించారు కూడా. ఈ సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవి ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Black Magic: చేతబడి చేశారనే అనుమానంతో భార్యాభర్తల హత్య.. పారిపోయిన కొడుకు.. పది మంది అరెస్ట్!