Nara Lokesh – Vangaveeti Radha Meet: వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.. మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి సమాచారం రావటంతో ఇవాళ కలవటానికి హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరారు వంగవీటి రాధా.. తాజా భేటీ అజెండా ఏంటి అనే అంశంపై రకరాలుగా చర్చలు జరుగుతున్నాయి.. ఇప్పటికే తమ నేతకు ఎమ్మెల్సీ సహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి రాధా వర్గంలో ఉంది.. గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం.. విస్తృతంగా ప్రచారం చేశారు వంగవీటి.. తనకు సీటు కేటాయించకపోయినా.. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు.. అయితే, ఇప్పుడు లోకేష్-రాధా భేటీలో ఏం చర్చిస్తారు? వంగవీటి రాధాకు ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అది ఎలాంటి పదవి కావొచ్చు..? అనే చర్చ మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
Read Also: Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!