TVS Sport: అధునాతన టెక్నాలజీ, ధరల పరంగా అందుబాటులో ఉండే మోడళ్లతో టీవీఎస్ బైక్స్‌కు ఆటో మొబైల్ మార్కెట్లో మంచి పేరు ఉంది. ముఖ్యంగా టీవీఎస్ జూపిటర్, ఎన్టోర్క్, స్పోర్ట్ వంటి మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక టీవీఎస్ మోటార్ తన బడ్జెట్ సెగ్మెంట్ లోని ప్రముఖ మోడల్ ‘టీవీఎస్ స్పోర్ట్’ బైక్‌ను 2025 వర్షన్‌లో అప్‌డేట్ చేసి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్ భారతదేశంలో పేద, మధ్యతరగతి వినియోగదారులకు అనుకూలంగా తక్కువ ధరలో లభ్యమవుతోంది. ఈ కొత్త స్పోర్ట్ బైక్‌కు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, కొత్త రంగులలో ఆప్షన్లు అందించబోతున్నారు. ప్రస్తుతం ES, ELS అనే రెండు వేరియంట్లలో మాత్రమే దీనిని అమ్మకాలు చేపడుతున్నారు. ఈ కొత్త మోడల్ స్ట్రెయిట్ బ్లూ, ఆల్ బ్లాక్, ఆల్ గ్రే, ఆల్ రెడ్ అనే 4 మోనోటోన్ కలర్ ఆప్షన్లలో రానుంది. కొత్త హంగుల కారణంగా బైక్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ బైకు ఇంజిన్, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 109.7cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8.08bhp పవర్, 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, డ్రమ్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. అలాగే, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అలాగే ఇందులో 17 అంగుళాల ట్యూబ్ లెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ప్రస్తుత TVS స్పోర్ట్ మోడల్ ధర రూ. 71,785 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త వెర్షన్ ప్రస్తుత వెర్షన్ కంటే కాస్త ఖరీదైనదిగా ఉంటుందని నిపుణుల అంచనా.