మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని, క్యూబిక్ మీటర్ ఒక్క రూపాయుకే, రైతులకు సరఫరా చేసేలా అనుమతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు.
2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే అని ఆరోపించారు. అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కౌంటర్ ఇచ్చారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి.. జగన్ ఛీత్కారానికి గురయ్యారని నిమ్మల ఎద్దేవా చేశారు. ‘ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి…