Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశాం.. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించాం.. కేబినెట్ మీటింగ్ లో సీఎం ఆటో డ్రైవర్స్ గురించి హామీ ఇచ్చారు.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు.. ఇక, ఎన్నికల సమయంలోనే ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తెలుసుకున్నాను.. ప్రభుత్వానికి భారమైన మీ కోసం ఆనందంగా దాన్ని మోస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Yerragadda: కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలి: మంత్రి పొన్నం
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో కార్మికులను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చాం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క డ్రైవర్‌కు రూ. 15 వేలు అందజేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆటో డ్రైవర్లు నవ్వుతూ ప్యాసింజర్లను పలకరిస్తుంటారు, రైల్వే, బస్సు, ఎయిర్ పోర్టులకు వెళ్లాలంటే ఎక్కువ మంది ఆటోలనే సంప్రదిస్తారు అని గుర్తు చేశారు. ఇక, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలి అని మంత్రి లోకేష్ సూచించారు.