NTV Telugu Site icon

Minister Satya Kumar Yadav: హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు.. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు..!

Minister Satyakumar

Minister Satyakumar

Minister Satya Kumar Yadav: తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్‌ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.. ఒక్క తిరుపతినే కాదు, హిందూ సంప్రదాయంపైన కూడ జగన్ దాడులు చేశాడని మండిపడ్డారు.. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని NDBB సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు.. ఇక, న్యాయవాది పొన్నవోలు పంది కొవ్వుని బంగారంతో పోల్చటం దేవుడిని అపహాస్యం చేసినట్లే అని మండిపడ్డారు.. పంది కొవ్వుని బంగారంతో పోల్చిన పొన్నవోలు మాటలు అర్థరహితమన్నారు..

Read Also: Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్‌కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..

ఇక, తిరుపతిలో జరిగిన ఘటన హిందువల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు మంత్రి సత్యకుమార్.. తిరుమల పుణ్య క్షేత్రం పై భక్తి ఉంటే ఆస్తులను వేలం వేసేవారు కాదు అన్నారు.. వైసీపీ నాయకులు తిరుమలపైనే.. ఆలయ పవిత్ర తగ్గేలా ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.. అయితే, తప్పులు చేసినవారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు నుండి గాంధీ జయంతి వరకు ఏక్ పేడ్ మా కే నామ్ (Ek ped Maa Ke Naam) తల్లికి ఒక మొక్క అనే కార్యక్రమం ఉద్దేశ్యంతో చేపట్టాం అన్నారు.. ప్రకృతి సమతుల్యంగా ఉండాలని ప్రతి విద్యార్థికి అవగాహన తెలియజేసేలా ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని పిలుపునిస్తున్నాం.. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అని వెల్లడించారు.. రక్తదానం చేసేందుకు ప్రతి విద్యార్థి, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.. రక్తదానం ఎంత ముఖ్యమో.. దానిపైన అవగాహన కూడా కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్..