Kesineni Nani vs Kesineni Chinni: తన తమ్ముడిని టార్గెట్ చేసిన కేశినేని నాని.. సీఎంను ట్యాగ్ చేస్తూ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు..!
- ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు..
- సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Nani vs Kesineni Chinni: బెజవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. ఆయన సోదరుడు ప్రస్తుత బెజవాడ ఎంపీ కేశినేని చిన్న మధ్య ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి.. గత ఎన్నికలకు ముందు అవి మరింత తీవ్రరూపం దాల్చాయి.. వైసీపీ నుంచి అన్న కేశినేని నాని పోటీ చేస్తే.. టీడీపీ నుంచి తమ్ముడు కేశినేని చిన్ని బరిలోకి దిగి విజయం సాధించారు.. అయితే, ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడును సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. తన సోదరుడు ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు..
Read Also: PSR Anjaneyulu Arrest: ముంబై నటి జత్వానీ కేసు.. సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!
Also Read
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కు భూమిని కేటాయించడం చంద్రబాబు తీసుకున్న దార్శనిక చర్య.. ఇటువంటి కార్యక్రమాలు నిజమైన పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి ఉపయోగం.. అయితే, రూ. 5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి కొత్తగా ఏర్పడిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాల సమాంతర భూమి కేటాయింపు సరికాదన్నారు కేశినేని చిన్ని.. ఈ సంస్థ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూపొందించిన బినామీ మరియు మోసపూరిత పథకంగా ఆరోపించిన ఆయన.. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి కేటాయింపుకు కొన్ని వారాల ముందు స్థాపించబడింది.. దీనికి గత అనుభవం లేదు, విశ్వసనీయ నేపథ్యం లేదు.. సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, MPకి చాలా కాలంగా సహచరుడు మరియు ఇంజనీరింగ్ కళాశాల క్లాస్మేట్.. గతంలో ఇన్వెస్ట్మెంట్స్ & ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అపఖ్యాతి పాలైన కంపెనీలో అతని మాజీ వ్యాపార భాగస్వామి.. ఈ కంపెనీ ప్రజల నుండి కోట్లు వసూలు చేసి, చాలా మంది అమాయక కొనుగోలుదారులను మోసం చేసి మూసివేసిందని పేర్కొన్నారు..
Read Also: CM Chandrababu: నేడు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. ఢిల్లీ షెడ్యూల్ ఇదే!
ఇక, కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) స్వయంగా ఉర్సా వెనుక దాగి ఉన్న శక్తి అని, పెట్టుబడి ముసుగులో ఈ భూ ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడానికి ఎంపీగా మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన ప్రభావాన్ని ఉపయోగించారని విమర్శించారు కేశినేని నాని.. ఎంపీ కేశినేని చిన్ని.. ఇసుక, బూడిద, కంకర మైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలలో లోతైన ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. ఈ పనుల్లో మంత్రి నారా లోకేష్ పేరును బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.. అవినీతి ప్రయోజనాల కోసం మీ నాయకత్వాన్ని మరియు పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తన తమ్ముడు, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారాన్ని తీసుకెళ్లారు మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని..
Respected @ncbn garu,
I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!