Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: ముందుగా చెప్పినట్టుగానే 11 నెల 11వ తేదీ 11 గంటలకు కొత్త పార్టీ ప్రకటించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అధ్యక్షుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తానొక్కడినే రాష్ట్రాన్ని మారుస్తానని చెప్పడం లేదని, రాష్ట్ర ప్రజల చేతుల్లోనే మార్పు తీసుకొచ్చే శక్తి ఉందని అన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగన్ అయినా, చంద్రబాబు అయినా తప్పు చేస్తే ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో తన పార్టీ విధానాలు, రాజకీయ లక్ష్యాలను వివరిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండు కుటుంబాల ఆధిపత్యం వద్దు.. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి
రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ఆంధ్రులను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల ఆధిపత్యం, వారసత్వ రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి కుమారుడే ముఖ్యమంత్రి కావాలా? ప్రతిపక్ష నాయకుడి కుమారుడే సీఎం కావాలా? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతోనే పార్టీ పెట్టానని, తాను వ్యక్తిగతంగా నాయకుడిగా ఎదగడానికి ఈ పార్టీని స్థాపించలేదని స్పష్టం చేశారు. యువతలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు అన్ని సామాజిక వర్గాల నుంచి నాయకులను తయారు చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో మరో నాయకుడిని, కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రెండు కుటుంబాలకు ఇకపై రాష్ట్రంలో చోటు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు.
Also Read
- Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
- Vijayawada Cyber Fraud: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.24 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!.. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాళీ..
- AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
- AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
ఎన్నికల ముందు పీఆర్పీ సత్తా చూపిస్తా
ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో తుఫాన్‌కు ముందు ఉండే ప్రశాంతత కనిపిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలకు ముందు పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) సత్తా ఏమిటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దుష్ట పాలనకు చరమగీతం పాడతామని వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో రాజకీయ మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
వైసీపీలో పదవులు ఊరికే రాలేదు.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు
తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులను ఊరికే అనుభవించలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, పార్టీ అధికారంలోకి వచ్చే వరకు శ్రమించానని చెప్పారు. వైసీపీలో కార్యకర్తలను, నాయకులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు. అయితే పార్టీలో తనకు తగిన గౌరవం, గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, జగన్‌తో తనకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ.. కొలిమిలో కాలిన సమ్మెట పోటులాంటి అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 151 స్థానాలు సాధించిన వైసీపీ 11 స్థానాలకే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు. నాయకత్వంలోని అహంకారమే పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమని విమర్శించారు. ప్రశ్నించే తత్వాన్ని నాయకత్వం భరించలేకపోయిందని, సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.
వైసీపీ కార్యకర్తలకు విజయసాయిరెడ్డి పిలుపు
వైసీపీలోని కార్యకర్తలకు విజయసాయిరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గౌరవం పొందాలని, ప్రజలకు సేవ చేయాలని భావించే వారు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారికి పరివర్తన రాజనీతి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిక.. రెడ్ బుక్ రాజ్యాంగంపై విమర్శలు
టీడీపీకి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడానికి కాదని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది వెన్నుపోటు కాలం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భావిస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఇంకా 30 నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పటికైనా పాలనా తీరును మార్చుకోవాలని సూచించారు. మొత్తంగా రాష్ట్రంలో రెండు కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలకడం, వారసత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా యువతతో పాటు అన్ని సామాజిక వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించే రాజకీయ వేదికగా పీఆర్పీని తీర్చిదిద్దడం తన లక్ష్యమని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
తాజావార్తలు
-
Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!