కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు. బెంగాలీ భాషలో సమత రాసిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు. భర్త గోపీనాథ్ ప్రేమ తగ్గిందని, పట్టించుకోవడం లేదని డైరీలో సమత ఆవేదన. చిన్నారి స్నిగ్ధను చంపి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు
నగరంలోని కేపీహెచ్‌బీ (KPHB) మూడో ఫేజ్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. తమ చిన్నారి కుమార్తె స్నిగ్ధను హత్య చేసి, ఆపై గోపీనాథ్, సమత దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెనుక ఉన్న మిస్టరీ వీడుతోంది.
బెంగాలీ డైరీతో వెలుగులోకి నిజాలు:
ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన కేపీహెచ్‌బీ పోలీసులకు మృతురాలు సమత తన మాతృభాష అయిన బెంగాలీలో రాసిన ఒక డైరీ లభించింది. అందులోని అంశాలను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. తనపై భర్త గోపీనాథ్‌కు ప్రేమ తగ్గిపోయిందని, తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమత ఆ డైరీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు గుర్తించారు. దంపతుల మధ్య నెలకొన్న తీవ్ర మనస్పర్థలు, మానసిక సంఘర్షణలే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Also Read
- Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
- Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
- Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
- Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఇవీ..
కేపీహెచ్‌బీ ఫేజ్-3లో నివాసముంటున్న గోపీనాథ్, సమత దంపతులు తమ చిన్నారి కుమార్తె స్నిగ్ధను హత్య చేసి తాము కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో అప్పట్లో గోపీనాథ్ రాసిన ఒక లేఖ లభ్యమైంది. అందులో “స్నిగ్ధ, సమత వెళ్లిపోయారు.. నేను కూడా వెళ్తున్నా” అని గోపీనాథ్ పేర్కొనడం కేసులో కీలక ఆధారంగా మారింది. అంటే, ముందుగా సమత తన కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత గోపీనాథ్ కూడా ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గోపీనాథ్ సోదరులకు అప్పగించారు. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించగా, పశ్చిమ బెంగాల్లో ఉన్న సమత కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా కడసారి చూపు చూసుకున్నారు. ఘటనా స్థలం నుండి ఎఫ్ఎస్ఎల్ (FSL) నమూనాలను సేకరించిన పోలీసులు, తాజాగా లభించిన బెంగాలీ డైరీ ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
-
Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!