Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులోకీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయేషా మీరా పేరెంట్స్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా సీబీఐ నివేదిక ఇవ్వకపోవడంతో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు ఆయేషా మీరా తల్లిదండ్రులు.. దీంతో, విచారణ జరిపిన సీబీఐ…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని.. ఆ పిటిషన్‌లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.