Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులోకీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయేషా మీరా పేరెంట్స్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా సీబీఐ నివేదిక ఇవ్వకపోవడంతో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు ఆయేషా మీరా తల్లిదండ్రులు.. దీంతో, విచారణ జరిపిన సీబీఐ…
సంచలం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అయేషా మీరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..
బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కొనసాగుతోన్న మిస్టరీ.. 17 ఏళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురికాగా ఇంకా నిందితులు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ నివేదిక ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు జరిపింది. బాధితులుగా ఉన్న ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటి వరకు 18 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగారని మళ్ళీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వస్తోందని పిటిషనర్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని.. ఆ పిటిషన్‌లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.
Ayesha Meera Case: సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సీబీఐ అధికారులు మరోసారి దర్యాప్తు చేపట్టారు.. ఈ కేసులో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపిన సత్యంబాబు.. నిర్దోషిగా బయటకు వచ్చాడు.. దీంతో కోర్టు తేల్చడంతో.. మరోసారి దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయేషా మీరా కేసులో నిర్దోషిగా తేలిన సత్యం బాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయేషా మీరా…
బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి తాను 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసులో సత్యం బాబు నిర్దోషి అని 2017లో ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని వివరించి తనకు రెండు ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారంతో పాటు ఇల్లు ఇవ్వాలని సత్యంబాబు కలెక్టర్‌ను కోరాడు. దీంతో సత్యంబాబుకు సహాయం చేయాలని గతంలోనే నందిగామ ఎమ్మార్వోను కలెక్టర్…
సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్యకేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. సత్యంబాబు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని…