AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
- ఏపీ లిక్కర్ స్కాం నిందితుల కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి..
- ఈ నెల 29న తీర్పు వెల్లడించనున్న ఏసీబీ కోర్టు..
- కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డిని 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్..
- ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను..
- వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్లు..
- నలుగుర్ని కలిపి విచారించాల్సిన అవసరం ఉందన్న ప్రభుత్వ న్యాయవాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తోంది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసింది సిట్. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో ఏ1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఏ31గా ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణమోహన్ రెడ్డి, ఏ34గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. వీరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు వెలుగుచూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజులు పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది దర్యాప్తు బృందం. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో కలిపి రాజ్‌ను విచారించాలని అప్పుడే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డిని మూడు రోజులు, మిగతా ముగ్గురు నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించింది. నలుగురు నిందితులను కలిపి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురు నిందితులను కలిపి విచారిస్తే కీలక విషయాలు బయట పడే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సీజ్ చేసిన ఫోన్లు, ఇతర మెటీరియల్‌ను కోర్టులో సబ్‌మిట్ చేయకుండా నేరుగా FSLకు పంపుతున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఆఫీసులో ఆడియో, వీడియో రికార్డు ఉందని కస్టడీకి ఇస్తే అక్కడకు పంపి ఆడియో, వీడియో రికార్డు చేయించాలని కోర్టును కోరారు. విచారణలో అడిగిన ప్రశ్నలు, విచారణ వివరాలు కోర్టుకు అందించాలని పిటిషనర్ న్యాయవాదులు కోరారు. దీంతో సీల్డ్ కవర్‌లో వివరాలు ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది ఏసీబీ కోర్టు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?