Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు
- యనమలకుదురు శివాలయంలో హుండీ దోపిడీ కలకలం
- ఈఓ భవాని పాత్రపై వెలుగులోకి వచ్చిన వివరాలు
- సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దోపిడీ
- అర్చకులు అరెస్ట్.. ఈఓ పరారీలో విచారణ వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు ఆలయ ఈఓ (EO) భవాని సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఆలయ హుండీ తాళాలు సాధారణంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. అయితే, ఈఓ భవాని తన సిబ్బందిని పంపి ఆ తాళాలను తెప్పించేవారు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడు సాగర్, ఆయన సహాయకుడు పూర్ణ ఆ తాళాలకు మారుతాళాలు (Duplicate Keys) తయారు చేయించారు. హుండీ లెక్కింపు సమయంలో కాకుండా, ఇతర సమయాల్లో మారుతాళాలతో హుండీలు తెరిచి నగదును మాయం చేసేవారు.
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
Also Read
- AP Municipal Elections 2026: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఆలయ మంటపంలోని 16 సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మరీ ఈ దోపిడీకి పాల్పడేవారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన కానుకలు ఈ విధంగా మాయమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, బ్యాంకులో నగదు జమ చేసే సమయంలో నోట్ల కట్టల్లో అదనపు నోట్లు పెట్టి, ఆ తర్వాత ఆ అదనపు సొమ్మును ఈఓ భవాని పక్కదారి పట్టించేవారని గుర్తించారు. ఆలయ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన అర్చకుడు సాగర్, సహాయకుడు పూర్ణ, , తాత్కాలిక ఉద్యోగి రోసయ్యలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈఓ భవాని ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై పరారీలో ఉన్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. చినిగిన నోట్లను గోనె సంచుల్లో వేసి ఒక గుమస్తా ఇంటికి తరలించిన వైనం కూడా పోలీసుల తనిఖీల్లో బయటపడింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!