జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు.
Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్
Also Read
అటు జనవరి 3న రావిశాస్త్రి శత జయంతి సభ, 4న పుస్తక ప్రియుల ర్యాలీ నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు బాల గంగాధర తిలక్ శత జయంతి సభ, 6వ తేదీ సాయంత్రం ఆత్రేయ శత జయంతి సభ, 7వ తేదీ సాయంత్రం వడ్డాది పాపయ్య శత జయంతి సభ జరుగుతుందన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి డిసెంబర్ 27 వరకు బుక్ ఫెయిర్ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?