Operation For Cobra: పాము అంటేనే పరుగులు పెడతారు.. భయంతో వణికిపోతారు.. ఇక నాగుపాము అంటే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎక్కడ పగబడుతుందో ననే భయం వెంటాడుతుంది.. అది కొందరి వరకు మాత్రమే.. పాములను ప్రేమించేవారు ఉన్నారు.. లాలించేవారు ఉన్నారు.. ఇక వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు.. గాయపడిన పాముకు కూడా వైద్యసాయం అందించి తమ వృత్తి ధర్మాన్ని చాటుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఓ నాగపాముకు శస్త్ర చికిత్స అందించారు పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాజువాక పీఎస్ సమీపంలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న గోధుమ కలర్‌లోని నాగు పాము.. మూడంతస్తుల బిల్డింగ్ నుంచి జారిపడిపోయింది.. అది పడిన స్థలంలో కదల్లేని స్థితిలో ఉండిపోయింది.. ఇది గమనించిన స్థానికులు.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఆ వ్యక్తం.. దాని పరిస్థితిని చూసి.. తనకు తెలిసిన వైద్యం అందించాడు.. ఆ తర్వాత మల్కాపురం పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్ దగ్గరకు తీసుకెళ్లారు.. ఆ నాగపాము పరిస్థితిని గమనించిన ఆయన.. దాదాపు గంటపాటు శ్రమించి శస్త్ర చికిత్స అందించాడు.. పాము తలభాగంలో కుట్లు వేశారు.. పాము ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.. మొత్తంగా.. నాగపాముకు శస్త్ర చికిత్స చేసిన ఘటన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..