కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలు పెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్ననగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. అయితే.. బుధవారం జియాన్.. షాంఘై నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న లాక్ డౌన్ గురించి తలుచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నుంచి రేషన్ అందిందని షాంఘై ప్రజలు సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. తాజాగా విజృంభణ నేపథ్యంలో షాంఘై, బీజింగ్ నగరాల్లో మాస్ టెస్టింగ్కు ఆదేశాలు జారీ అయ్యాయి. 13 మిలియన్లు జనాభా కలిగిన జియాన్ నగరం గతేడాదిలో నెల రోజుల పాటు లాక్ డౌన్లో ఉండిపోయి.. చెత్తను రీసైక్లింగ్ చేసే సిబ్బందిలో కేసులు బయటపడటంతో తాత్కాలిక నియంత్రణ చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈనేపథ్యంలో.. బుధవారం అర్ధరాత్రి నుంచి పబ్స్, బార్లు, ఇంటర్నెట్ కేఫ్లు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.. మంగళవారం అర్ధరాత్రి వరకు జియాన్ ప్రజలు నిర్ధారణ పరీక్షల కోసం క్యూ లైన్లో నిల్చొన్న చిత్రాలను అక్కడి మీడియా సంస్థ విడుదల చేసింది. కానీ, ఆ నగరం లాక్ డౌన్ లేదంటూ నొక్కి చెప్పింది.
read also: Dengue Outbreak: మారిన వాతావరణం- గ్రేటర్ పై వైరల్ పంజా
ప్రస్తుతం ఉద్ధృతికి ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.5.2 కారణమని అధికారులు వెల్లడించారు. కరోనాకి వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక శక్తిని దాటవేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే కొవిడ్ జీరో వ్యూహంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న చైనా, అధ్యక్షుడు షీ జిన్ పింగ్కు ప్రస్తుత విజృంభణ సరికొత్త సవాలు విసురుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా అధ్యక్షుడు తన వ్యూహానికి కట్టుబడే ఉండి, కఠిన ఆంక్షలకు వెనుకాడటం లేదు. జపాన్ బ్యాంకు నోమురా అంచనాల, అయితే.. సోమవారం నుంచి దాదాపు 114.8 మిలియన్ల ప్రజలు లాక్ డౌన్ లేక పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నారని .. ఆ సంఖ్య 66.7 మిలియన్లుగా ఉంది.
KS.Ramarao: ‘క్రియేటివ్ కమర్షియల్స్’ రామారావు!