Vellampalli Sreenivas Challenges Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాల్లో సై అంటే సై అంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఛాలెంజ్‌పై తాజాగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని, ఆ కలల్ని మానుకోవాలని సూచించారు. ఒకవేళ గోదావరి జిల్లాల్లో వైసీపీ గెలిస్తే.. నువ్వు నీ జనసేన పార్టీని మూసుకుని వెళ్తావా? అంటూ పవన్‌కి సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్‌కి లేదని ఎద్దేవా చేశారు. ఒక్కచోట కూడా గెలవని వాడు సవాల్ విసురుతుంటే.. తనకు నవ్వొస్తుందని దుయ్యబట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో తమని ఓడించడం కాదని, ముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాలని హితవు పలికారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్‌పై ఈర్ష్యపు మాటలు ఆపకపోతే.. పవన్ కళ్యాణ్‌కి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Minister Venugopala Krishna: పవన్‌కి మంత్రి వేణు స్ట్రాంగ్ కౌంటర్.. బాబు ట్రాప్‌లో..
అంతకుముందు కూడా.. పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి ప్రోటోకాల్ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ పని పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆ ముగ్గురు ఏపీ పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు చేయలేని ఇన్వెస్టర్స్ సదస్సును సీఎం జగన్ నిర్వహించారని పేర్కొన్నారు. చంద్రబాబు గతంలో సూట్లు వేయించి తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకువచ్చామని ప్రచారాలు చేసేవారని ఆరోపించారు. సీఎం జగన్ మాత్రం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు అయిన ముఖేష్ అంబానీ, అదానీ వంటి వారిని తీసుకొచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు అసలు అంబానీ గానీ, ఇతర పారిశ్రామికవేత్తలు గానీ ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. రౌడీల లెక్కలు తీరుస్తామని చెప్తున్న చంద్రబాబు.. ముందు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గెలవాలని సవాల్ విసిరారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టుకొని గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.
Margani Bharat: పవన్‌కు ఎంపీ భరత్ సవాల్.. 175 సీట్లకు పోటీ చేస్తారా?