Chelluboina Venugopala Krishna Strong Counter To Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ప్రసంగంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ‘చంద్రబాబు ట్రాప్’లో పడ్డాడని పేర్కొన్నారు. ‘పవన్ కళ్యాణ్ మొదట్లో దేశం అన్నాడు, ఆ తర్వాత రాష్ట్రం అన్నాడు, ఇప్పుడు గోదావరి జిల్లాలకు పరిమితం అంటున్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు. అసలు కుల ప్రస్తావన లేకుండా మాట్లాడలేని వ్యక్తి పవన్ అని మండిపడ్డ మంత్రి.. ‘నీ సామాజిక వర్గం ఓట్లు టీడీపీ వైపు తిప్పమని బాబు చెప్పాడా?’ అని ప్రశ్నించారు. పవన్ పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఇక లోకేష్‌ది ఫెయిల్యూర్ పాదయాత్ర అని, అతడు అసహనంతో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఎవరెంతమంతి కలిసొచ్చినా.. ఎన్ని కుట్రలు పన్నేందుకు ప్రయత్నించినా.. 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వం రానుందని ధీమా వ్యక్తం చేశారు.
Margani Bharat: పవన్‌కు ఎంపీ భరత్ సవాల్.. 175 సీట్లకు పోటీ చేస్తారా?
అంతకుముందు కూడా.. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబేనని, టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా నిరంకుశంగా వ్యవహరించారని మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శించారు. చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాబు చర్యలు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు విజనరీ కాదని, విజన్ లేని వ్యక్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే.. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడని అభిప్రాయపడ్డారు. స్పెషల్ ప్యాకేజీ కోసమే పవన్ పొత్తులు పెట్టుకుంటాడని చెప్పిన ఆయన.. ఎవరి అజెండాను పవన్ అమలు పరచాలని అనుకుంటున్నాడని ప్రశ్నించారు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్ళు చల్లాడని, తనని నమ్మిన వాళ్ళని పవన్ దగా చేశాడని విమర్శించారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడని.. ఏ లక్ష్యాలతో పవన్‌కు జనసైనికులు మద్దతిచ్చారో, అది చేయలేనని పరోక్షంగా చెప్పాడని మంత్రి పేర్కొన్నారు.
Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..