Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vasupally Ganesh Reaction On Brs Party

Vasupally Ganesh: బీఆర్ఎస్ వచ్చినా …30ఏళ్ళు జగనే సీఎం

Published Date :October 5, 2022 , 3:15 pm
By NTV WebDesk
Vasupally Ganesh: బీఆర్ఎస్ వచ్చినా …30ఏళ్ళు జగనే సీఎం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా ప్రకటించారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర రావు. ఈ మార్పు పట్ల రాజకీయంగా ప్రతిస్పందనలు వినిపిస్తున్నాయి. బీ.ఆర్.ఎస్.ఏర్పాటు వల్ల ఆంధ్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కు అవకాశమే లేదు. సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి దార్శనికత వల్ల వచ్చే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే సీఎం అన్నారు ఎమ్మెల్మే గణేష్.

Read Also: Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త రూల్స్

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్టపోయింది…అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే ఉండిపోవడం వల్ల చాలా జిల్లాలు వెనుకబాటుతనానికి గురయ్యాయి. ఇప్పుడు టీ.ఆర్.ఎస్. ఎన్ని పేర్లు మార్చు కుని వచ్చినా ఆంధ్రా ప్రజలు విశ్వసించరని తన అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇదిలా వుంటే.. మంత్రి జోగి రమేష్ బీఆర్ఎస్ పై చురకలు అంటించారు. బీఆర్‌ఎస్‌ కాదు.. ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేదన్నారు. వైసీపీ పార్టీ ఎవరికీ భయపడదని చెప్పారు. ఏపీ ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.

Read Also:KCR National Party: టీఆర్ఎస్‌.. ఇక బీఆర్ఎస్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra politics
  • cm jagan
  • cm kcr
  • ktr
  • new politics

తాజావార్తలు

  • Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

  • Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

  • Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions