Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త నిబంధనలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం వాహన పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగానే టోల్ వసూళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో వాహనం పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుంది. యూజర్లు వాడిన విద్యుత్‌కు ఎలాగైతే బిల్లు చెల్లిస్తారో అదే తరహాలో వాహనం పరిమాణం, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయనున్నారు.
త్వరలో టోల్ ప్లాజాలు తొలగింపు
టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండేలా టోల్ విధానాన్ని ప్రక్షాళన చేయాలని కేంద్రం యోచిస్తోంది. నూతన విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేస్తారు. ఫాస్టాగ్ వచ్చాక టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గిపోయింది. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అదే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే ప్రణాళిక దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే వెల్లడించారు. టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ చార్జీ ఎలా వసూలు చేస్తారంటే..నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఎకౌంట్ నుంచి ఛార్జీని వసూలు చేస్తారు. ఫాస్టాగ్ విధానంలో కార్లపై ఆర్ఎఫ్డీ ట్యాగ్ స్టిక్కర్ వేస్తుండడం తెలిసిందే. నంబర్ ప్లేట్లను రీడ్ చేసే విధానంలో వీటి అవసరం ఉండదు.
Read Also: Elon musk: ట్విట్టర్ డీల్ పై మనసు మార్చుకున్న మస్క్
గతంలో ఈ విషయం గురించి మంత్రి గడ్కరి మాట్లాడుతూ ‘‘కంపెనీ ఫిట్ చేసిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రోడ్లపైకి రావాలని 2019లో నిబంధనలు తెచ్చాం. గత నాలుగేళ్లలో రోడ్లపైకి వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లు డిఫరెంట్ ఉంటున్నాయి. కార్లకు ఈ తరహా నంబర్ ప్లేట్లు లేకపోతే నిర్ణీత సమయంలోగా వాటిని అమర్చుకునే విధంగా నిబంధనలు తేవాలి’’ అని వివరించారు. ప్రస్తుతం టోల్ ఛార్జీల్లో 97 శాతం అంటే సుమారు రూ.40,000 కోట్లు ఫాస్టాగ్ ల ద్వారా వసూలు అవుతున్నాయని..తెలిపారు మంత్రి గడ్కరి.