అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ అసెంబ్లీని భూతుపురాణంగా మార్చేశారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కేటుగాళ్లందరూ అసెంబ్లీలో కూర్చున్నారని.. వైసీపీ నేతలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం జగన్ తల్లి, చెల్లి కూడా ఓ మహిళే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యపై ఇష్టానుసారంగా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోరా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
Read Also: చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు: మంత్రి కొడాలి నాని
సైకోలే అవతలి వాళ్ల కన్నీళ్లు చూసినప్పుడు ఆనందపడతారని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు చేసిన దాడులపై మాట్లాడితే కేసులు పెడతారని ఆరోపించారు. బబర్దస్త్ హీరోయిన్ ఈరోజే సంక్రాంతి, దీపావళి, దసరా పండగలు చేసుకో అంటూ రోజాను ఉద్దేశించి విమర్శించారు. ఇప్పటికీ రోజా టీడీపీ పునాదులపైనే నిలబడిందని.. ఈ విషయాన్ని ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. భువనేశ్వరి, తెలుగు మహిళలపై ఇలాగే మాట్లాడితే వైసీపీ నేతలను చెప్పులతో కొడతామని హెచ్చరించారు.