చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు: మంత్రి కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాని నాని అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలను చంద్రబాబే చేశాడని బయట మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ హత్యల గురించి సభలో చర్చించాలని మంత్రి కొడాలి నాని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నాడో.. రంగా, మాధవరెడ్డి హత్యల గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని కొడాలి నాని అన్నారు. అన్ని విషయాలపై చర్చించాలని తాము చెప్తే… నా కుటుంబం గురించి మాట్లాడారు.. నా భార్య గురించి మాట్లాడారు అంటూ చంద్రబాబు సింపతీ కార్డులు తీస్తున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Read Also: భార్య పేరుతో చంద్రబాబు సింపతీకి ప్రయత్నిస్తున్నారు: అంబటి రాంబాబు

ప్రస్తుతం చంద్రబాబు పని అయిపోయిందని.. అందుకే ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక అస్త్రం సింపతీ అని.. దాని కోసం చంద్రబాబు చేయాల్సినవన్నీ చేస్తున్నాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు గ్లిజరిన్ రాసుకుని ఏడ్చాడని.. అసలు గ్లిజరిన్ సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ఆయనకు కన్నీళ్లు రాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారన్నారు. నిన్న అసెంబ్లీకి చంద్రబాబు రాలేదని… దాదాపు రెండున్నర గంటల పాటు పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిన్న సాయంత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని కొడాలి నాని తెలిపారు. సభ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు నిన్నే డిసైడ్ అయ్యారని.. ఈ విషయం తనకు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాడని వివరించారు. రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేయగలడని… చంద్రబాబు చేసేవన్నీ మంగమ్మ శపథాలేనని ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles