Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. గన్నవరంలో ఉద్రిక్తత, చంద్రబాబు టూర్‌లో చేసిన కామెంట్లపై అదేస్థాయిలో ఎటాక్‌కు దిగారు.. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చన్న వంశీ.. చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అసోం వెళ్లొచ్చు.. నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి ఎగరొచ్చు.. కావాలంటే గోదావరిలోకి కూడా దూకొచ్చు.. కానీ, సెక్షన్ 144, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు నియంత్రిస్తారు? అని అని ప్రశ్నించారు. తన హయాంలో ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగలు రాష్ట్రంలో తిరగకుండా చంద్రబాబు నియంత్రించాడు.. మరి దానిని ఏమంటారని నిలదీశారు. ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్లే ఒక రోజు చంద్రబాబు గన్నవరం వెళ్లకుండా పోలీసులు నియంత్రించారని తెలిపారు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్న ఆయన.. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూసి చంద్రబాబు కూడా అవే డైలాగులు చెబుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: గత ఏడాది దేశంలోనే ఏపీకి అత్యధిక పెట్టుబడులు..
చంద్రబాబు నన్ను పశువుల డాక్టర్ అంటున్నాడు.. తిరుపతిలో చంద్రబాబు శిశువుల డాక్టర్‌ను మోసం చేసిన కథ చెప్పమని కొందరు అడుగుతున్నారు.. ఆ కథ చెబితే మళ్ళీ బోరున ఏడుస్తాడేమో అంటూ వ్యాఖ్యానించారు వంశీ.. ఎక్కువగా మాట్లాడితే నేను కూడా శిశువుల డాక్టర్ కథ చెప్పాల్సి వస్తుందంటూ మండిపడ్డారు.. మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ నారా లోకేష్ ఆహ్వానించడంపై స్పందించిన వల్లభనేని వంశీ.. తెలుగు దేశం పార్టీని పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్.. కానీ, నీ తాత ఖర్జూర నాయుడు కాదు అంటూ సెటైర్లు వేశారు.. అసలు నువ్వు ఎవరు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడానికి అంటూ లోకేష్‌ని నిలదీశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మొత్తంగా.. చంద్రబాబు, లోకేష్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తూనే.. మధ్యలో.. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు వల్లభనేని వంశీ.