వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలను నేటితో నిలిపేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో నేటితో వైకుంఠ ద్వార దర్శనాలు నిలిపివేస్తామని టీటీడీ ప్రకటించింది.. కాగా, పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగిస్తూ వచ్చిన టీటీడీ.. ఇవాళ అర్దరాత్రితో వైకుంఠ ద్వారాలు మూసివేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలసిందే.. ఇక, ప్రస్తుతం కోవిడ్ మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ.. మరోవైపు.. శుక్రవారం 39,440 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. వీరిలో 13,652 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.53 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
Read Also: స్కూళ్లలో కరోనా కలకలం.. 10 శాతం కేసులు అక్కడే..