తెల్లవారు జామున 4 గంటలు. రోజులాగానే లేచి సైకిల్ తీసుకుని వాకింగ్ కు బయలు దేరాడు. మధ్యలో సైకిల్ పక్కన పెట్టి నడస్తున్నాడు. ప్రశాంత వాతారణం ఇంతలోనే తుఫాను మీదపడినట్లు నలుగురు వ్యక్తులు ఓకారులో వచ్చి వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ఏంజరుగుతుంతో కాసేపు తనకి ఏం అర్థం కాలేదు. ఇంతలోనే తేరుకుని దాడికి పాల్పడుతున్న వ్యక్తులపై తిరగబడి ఎదురు దాడి చేస్తుండగా వారు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో శివన్నారాయణను కొట్టారు. ఇంతలో అతని ఒంటిపైనున్న వస్తువులను లాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా ఇతని కేకలతో చుట్టు పక్కల వారు రావడంతో అతన్ని వదిలి అక్కడి నుంచి వచ్చిన కారులోనే పారిపోయారు. ఈఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ముమ్మిడివరం నియోజకవర్గం క్రాప చింతల పూడిపాలెం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.
అయితే.. ఈఘటనలో బాధితునికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడినిముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం శివన్నారాయణ పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంతరు స్థానికులు పోలీసులకు సమాచాచం ఇవ్వడంతో.. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివన్నారాయణతో మాట్లాడి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈదాడి పాత కక్షల వల్లే వాళ్లు ఇలా చేశారా? లేక బంగారం కోసం దాడి చేశారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pakistan Prime Minister: భారత్తో శాశ్వత శాంతి కావాలి.. యుద్ధం ఆప్షన్ కాదు..