Ummareddy Venkateswarlu On Kotamreddy Sridhar Reddy Phone Tapping Issue: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఫోన్ టాపింగ్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది కాదని స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అలా చేయదని, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా నేరమేనని తేల్చి చెప్పారు. తన ఫోన్‌ని ట్యాప్ చేశారంటూ కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత విభేదాలతోనే కోటంరెడ్డి పార్టీపై బురద జల్లుతున్నాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నాయకుల్ని చూసి కాదు, జగన్ పరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో కొన్ని అంశాలు చర్చకు వచ్చాయన్నారు. మిర్చి రైతుల సమస్యలు, తాగునీటి ఎద్దడి, వరికిపుడిసెల ప్రాజెక్టు అంశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లో ప్రత్యేక సమావేశం ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న సమస్యలపై చర్చిస్తామన్నారు.
Online Trafficking: ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్ అరెస్ట్
ఇదిలావుండగా.. తన ఫోన్‌ని ట్యాప్ చేశారని పేర్కొంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకొచ్చారు. వైసీపీలో కొనసాగడం ఇష్టంలేక మౌనంగా తప్పుకోవాలని అనుకుంటున్నానని కుండబద్దలు కొట్టారు. కానీ.. తన వ్యక్తిత్వాన్ని శంకించేలా మాట్లాడుతున్నారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తోందని తెలిపారు. ఈమధ్యకాలంలో తనకు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అందులో 10 శాతం బెదిరంపు కాల్సే ఉంటున్నారని అన్నారు. నిన్న తనకు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేశాడని.. తనని బెదిరించి, కొట్టేసి తీసుకెళ్తానని బెదిరించాడని.. తీసుకెళ్లు చూద్దామంటూ సవాల్ విసిరారు. తనపై కుట్రలు కూడా చేస్తున్నారన్నారు. మరోవైపు.. కోటంరెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇంతవరకు ఆయనకు మద్దతుగా నిలిచిన జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు, 23 డివిజన్ కార్పొరేటర్ మొయిల్ల గౌరీతోపాటు మరో కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డిలు.. కొత్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
Womens T20 World Cup: విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధం..పూర్తి వివరాలివే