ఏపీలో జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లుగా , గులక రాళ్ళుగా, గుండ్రాళ్ళుగా మారాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. పేదలందరికీ ఇళ్లు నవరత్నాలలో ఒక అంశం. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందచేశామన్నారు. కానీ జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా, పూర్తి అయినవి కేవలం 60,783 మాత్రమే అన్నారు.…