రాజమండ్రిలో గోరంట్ల నివాసానికి పార్టీ అధిష్టానం నుంచి త్రిసభ్య బృందం చేరుకుంది. అధిష్టానం బృందంలో విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రులు చినరాజప్ప జవహార్ తదితరులు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది టీడీపీ అధిష్టానం. రాజీనామా యోచన విషయంలో ఉన్న గోరంట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దాంతో గోరంట్ల నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అనుచరులు. బుచ్చయ్య డిమాండ్లు పరిశీలనలోకి తీసుకుని, ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలను తొలగించేలా బృందానికి టీడీపీ హైకమాండ్ దిశానిర్దేశం చేస్తుంది.