తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగానే ఉంది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ.. మే 15వ తేదీ నుంచి.. అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ పేర్కొంది..
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. తిరుమలలో ఇవాళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించినట్టు.. ఆ సమావేశం ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. ఇక, పిభ్రవరి 23వ తేదీన బాలాలయ పనులు ప్రారంభిస్తాం.. 6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామన్నారు.. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో సైతం వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది.…