టీటీడీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆగడాలు యాజమాన్యం పరువు తీసేలా మారాయి. ఒకొక్కటిగా వెలుగు చూస్తున్న ప్రిన్సిపాల్ సురేంద్ర ఆగడాలు స్టూడెంట్స్‌లో అసహ్య భావనను పుట్టిస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా ఫోన్లో మాట్లాడి ఆ ఆడియో టేపులను రికార్డు చేసేవాడని, వాటిని మళ్లీ వారికే పంపించి బ్లాక్ మెయిల్ చేసేవాడని బాధితులు పేర్కొంటున్నారు.
Read Also: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు: కిషోర్ కుమార్ రెడ్డి
తాను చెప్పినట్లు వింటే.. పరీక్షల్లో పాస్ చేస్తానని, పరీక్ష సరిగ్గా రాయకపోయినా 70 మార్కులు వేస్తానని అమ్మాయిలను లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో కళాశాల ఉన్నతాధికారులు సురేంద్రను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేశారు.టీటీడీ ఓరియంటల్ కాలేజీ పరువు తీసేలా ఉన్న సురేంద్ర ప్రవర్తన ఇదే తొలిసారి కాదని గతంలోనూ ఇదే తరహా ప్రవర్తనతో సస్పెండ్ అయ్యాడు.