YV SUbba Reddy: కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు టీటీడీ ఆలయాల నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. సైతిక శ్రీవారి శంఖు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి… విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి గుడివాడ అమరనాథ్, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, కలెక్టర్ మల్లికార్జున తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సముద్ర తీరాన కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు హైందవ ధర్మాన్ని ప్రచారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.. కార్తీక దీపోత్సవం కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. మారుమూల ప్రాంతాల్లో దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.. ఇక, వెంకటేశ్వర స్వామి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం.. 15000 వేల కోట్లకు పైగా నిధులు ఏ బ్యాంకులో డిపాజిట్ చేశామో వివరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని.. ఇప్పటికే వెంకటస్వామి దేవాలయం వైజాగ్ లో నిర్మించామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
Read Also: TTD : భక్తులకు టీటీడీ శుభవార్త..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు, సముద్ర తీరాన టీటీడీ ఆధ్వర్యంలో మహా దీపోత్సవ నిర్వహించడం సంతోషం ఉందని.. మహా దీపోత్సవ కార్యక్రమంకు టీటీడీ అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు కురిపించారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.. భక్తుల దగ్గరకే వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువచ్చారు.. గత మూడేళ్ళుగా టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని.. వెంకటేశ్వర స్వామి వెలసిన అద్భుతమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా వేదం నిలబడుతుంది అంటే అది వేంకటేశ్వరస్వామి మహిమ.. కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ఉన్న మహిమ ఎక్కడ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో 30 దేవాలయాలను టీటీడీ నిర్మించింది.. హిందు ధర్మ ప్రచారానికి టీటీడీ నడుం బిగించిందన్నారు. కార్తీక మాసంలో మహా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రోజు రోజుకు స్వామివారికి భక్తులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నారు.. ఇప్పటికే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఋషికొండలో ఏర్పాటు చేశారు.. ఒకవైపు సింహాచలం అప్పన్న, మరొక వైపు వెంకటేశ్వర స్వామి వైజాగ్ లో ఉన్నారని తెలిపారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!