ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల కుంభకోణం సంచలనం రేపుతుంది. జిల్లాలోని పలు ఉప ఖజానా కార్యాలయాల్లో బోగస్ టిడిఎస్ బిల్లులు క్లైమ్ చేశారు అధికారులు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్ ట్రెజరీ అధికారులు, ఒక సీనియర్ అకౌంటెంట్ సస్పెండ్ అయ్యారు. మదనపల్లి ఎస్టిఓ శ్రీనివాసులు, తంబళ్లపల్లి ఎస్ టి ఓ బాల మురళి, పుంగనూరు ఎస్ టి ఓ కార్యాలయంలోని సీనియర్ అకౌంటెంట్ జీవానందం లను సస్పెండ్ చేశారు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, వాయల్పాడు, పుంగనూరు కార్యాలయాల్లో టీడీఎస్ బోగస్ క్లైమ్ లను గుర్తించింది ఐటీ శాఖ. ముగ్గురు టీటీవోలకు సైతం చార్జీ మెమోలు జారీ చేశారు ఖజానా శాఖ ఉన్నతాధికారులు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము బోగస్ క్లైమ్ ల రూపంలో సొంత ఖాతాలకు మళ్ళించుకున్నారు ట్రెజరీ అధికారులు. రాష్ట్రంలోని పలు ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ఐటీ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయంటున్నారు అధికారులు.తప్పుడు టీడీఎస్ క్లెయిమ్‌లతో ఆదాయపన్ను శాఖకే నష్టం కలిగించిన ట్రెజరీ అధికారులను వదిలేది లేదంటున్నారు అధికారులు.
Read Also: Cyber Fraud: సూర్యాపేట వైద్యాధికారికి సైబర్ కేటుగాళ్ళ బురిడీ