ఖర్జూరం తింటుండగా విత్తనం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) అనే వ్యక్తి ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున గొంతులో ఇరుక్కపోయింది. దీంతో ఆ వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. గంగాధర్ ఇంటిలో ఖర్జూర పండ్లు తింటుండగా, ఒక విత్తనం అనుకోకుండా గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే అతనికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా పరిస్థితి విషమించింది. అయితే డాక్టర్లు అనంతపురం తీసుకెళ్లాలని డాక్టర్లు తెలిపారు. మార్గ మధ్యంలోనే గంగాధర్ ప్రాణాలు పోయాయి.దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు., అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అనంతపురం తరలించే సమయంలో మార్గమధ్యంలోనే గంగాధర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పెనుకొండ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.