Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ఇతర వృత్తులతో పోలిస్తే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. డాక్టర్లు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అవసరమైనప్పుడు పరస్పరం మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. కానీ, రాజకీయాల్లో మాత్రం వ్యక్తిగత విమర్శలు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలు ప్రజలకు సంబంధించిన అంశమని, పాలసీలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని సూచించారు కిరణ్.. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో రాజకీయాల స్థాయి దిగజారుతోందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రస్తుత టెలివిజన్ డిబేట్లు కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొన్ని చర్చలు చూస్తే టీవీనే ఆఫ్ చేయాలనిపించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వినియోగించడం కూడా మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవం ఉండాలని, ఒకరి గౌరవాన్ని మరొకరు తగ్గించుకునే ధోరణి వల్లే రాజకీయ విలువలు క్షీణిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..
Also Read
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!