Priyanka Chaturvedi: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో ‘‘పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్’’ అరచకాలపై అక్కడి ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని విమర్శిస్తున్నారు. జాతీయ విచారణకు అక్కడి ప్రభుత్వ నో చెప్పడంపై విమర్శలు వెల్లువెతున్నాయి. మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, హ్యారీపోటర్ రచయిత జేకే రౌలింగ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ మూలాలకు చెందిన ముఠా బ్రిటన్ మైనర్ బాలికపై అత్యాచారాలకు, అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో సమగ్రమైన చర్యలకు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీరిని ‘‘పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్’’లుగా పిలువద్దని వీరిని ‘‘పాకిస్తాన్ రేప్ గ్యాంగులు’’గా పిలవాలని జేకే రౌలింగ్ డిమాండ్ చేశారు.
యూకే పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ప్రధానీ కీర్ స్టార్మర్ ఈ గ్యాంగులను ‘‘ఆసియన్ గ్యాంగ్స్’’గా పిలవడాన్ని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది తప్పుపట్టారు. యూకే గ్రూమింగ్ గ్యాంగ్‌ల నిందను ఆసియాపై మోపలేమని ‘‘ఇక దుష్టదేశం’’ పాకిస్తాన్ ముఠాలుగా పిలువలాని కోరారు. అయితే, ఆమె వాదనల్ని ఎలాన్ మస్క్ ఏకీభవించారు. ఆసియన్ దేశాలు ఒక సంపూర్ణ మోసపూరిత దేశ నిందను ఎందుకు భరించాలి?? అని యఅన్నారు. చతుర్వేది మస్క్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి ఎలాన్ మస్క్ ‘‘నిజం’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Biggest Stampedes: దేశంలో జరిగిన అతి పెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే.. వందలాది మరణాలు!
2008-2013 వరకు ఈ పాకిస్తానీ మూలాలు ఉన్న ముఠాలు బ్రిటన్ వైట్ గర్ల్స్‌కి లైంగికంగా వేధించారు. ఆ సమయంలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) అధిపతిగా ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ ఉన్నాడు. ఈ ముఠాలపై ఆయన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ విమర్శించింది. సిక్కు సంస్థల నెట్‌వర్క్ (NSO) మాట్లాడుతూ.. ఈ సమస్యలో నిందితుల జాతి, మతం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేసింది.
ఒక దశాబ్దం క్రితం అధికారిక నివేదికలు 1,400 మంది పిల్లలను లైంగికంగా దోపిడీ చేశాయని, బహుళ నేరస్థులచే అత్యాచారం చేయబడ్డారు, ఇతర పట్టణాలకు రవాణా చేయబడ్డారు, అపహరించబడ్డారు, బాధిత బాలికల్లో చాలా మంది వయసు 14 ఏళ్ల లోపే ఉంది. బాలికలను లైంగికంగా వేధించినందుకు కారణమైన ముఠాలను విచారించడంలో విఫలమయ్యారనే ఆరోపణలను స్టార్మర్ తిరస్కరించారు.
Repeat after me, they aren’t ASIAN Grooming Gangs but PAKISTANI grooming gangs.
Why should Asians take the fall for one absolute rogue nation?
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 8, 2025