TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు..
- వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ..
- ఎస్పీ హర్షవర్థన్ రాజుకు ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి..
- కరుణాకర్ రెడ్డిపై పలు సెక్షన్లు కింద కేసు పెట్టాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలిసులను లిఖితపూర్వకంగా కోరారు భాను ప్రకాష్ రెడ్డి.
Read Also: Mallu Bhatti Vikramarka: మహిళా అభివృద్ధే లక్ష్యం.. స్త్రీ సమ్మిట్ 2.0లో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
ఇక, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎస్వీ గోశాలపై అసత్య, అబద్దపు ప్రచారాన్ని చేశారు.. కరుణాకర్ రెడ్డి దృష్టికి లోపం ఉంది ఏమో.. ఇష్టం వచ్చినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు.. నోరు ఉంది కధ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయామని కోరాం.. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి.. గతంలో మేము వైసీపీ హాయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని తేల్చి చెప్పారు. వైసీపీ హాయంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Crime News: దుబాయ్‌లో దారుణం.. పాకిస్తానీ చెతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు హత్య
ఇక, టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైసీపీ చేసినా అక్రమాల అన్నిటి పైనా చర్యలు తీసుకుంటుందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదు.. అందరి అవినీతిని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. నేను లోకల్ లే టీటీడీలో ఆయన కంటే ఎక్కువ సమాచారం నా దగ్గర ఉంటుంది.. భవిష్యత్తులో టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసినా, మాట్లాడినా ఏ స్దాయి వ్యక్తి పైనా అయినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం.. ఆ దిశగా బోర్డులో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
-
Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!
-
SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
-
Yamaha Ethanol Bike: ఇథనాల్‌తో నడిచే యమహా బైక్ భారత్‌లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?