Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Srinu: టాలీవుడ్లో నటుడు ప్రభాస్ శ్రీనుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రభాస్తో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకు వచ్చిన ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉందని శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్లో వెల్లడించారు. అసలు తనకు “ప్రభాస్ శ్రీను” అనే పేరు ఎలా వచ్చిందో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ప్రభాస్ను అందరూ ప్రేమగా “డార్లింగ్” అని పిలుస్తారని, ఆయన కూడా తన చుట్టూ ఉన్నవారితో చాలా ఆప్యాయంగా ఉంటారని శ్రీను తెలిపారు. ప్రభాస్తో కలిసి పనిచేసే దర్శకులు, స్నేహితులు, సిబ్బంది అందరితోనూ ఆయన ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతారని వెల్లడించారు. అయితే “ప్రభాస్ శ్రీను” అనే పేరు కావాలని తాను పెట్టుకోలేదని శ్రీను స్పష్టం చేశారు. “ప్రభాస్ శ్రీను” అనే పేరు ఎలా వచ్చిందంటే.. తన అసలు పేరు శ్రీను కావడంతో, ప్రభాస్ గారితో కలిసి ఎక్కువగా కనిపించడం, సినిమాల్లో ఆయనతో అనుబంధం ఉండటం వల్ల క్రమంగా ఆ పేరు జనాల్లోకి వెళ్లిందని చెప్పారు.
“శ్రీను” అనే పేరు సాధారణంగా చాలామందికి ఉంటుందని, ఆ పేరుతో ఒక్కరిని గుర్తుపట్టడం కష్టమని ఆయన అన్నారు. కానీ ఏదైనా ప్రత్యేక గుర్తింపు కోసం ఒక వ్యక్తి పేరు ముందు ఒక డిజిగ్నేషన్ చేరితేనే అది ప్రత్యేకంగా మారుతుందని వివరించారు. “మా ఆఫీస్లో శ్రీను, డిపార్ట్మెంట్లో శ్రీను, టెక్నీషియన్ శ్రీను ఇలా చాలామంది ఉంటారు. కానీ ‘ప్రభాస్ శ్రీను’ అంటే మాత్రం అందరికీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుర్తుకు వస్తారు” అని ఆయన తెలిపారు. తాను నాలుగు సినిమాల్లో ప్రభాస్తో కలిసి కనిపించడం, నటుడిగా గుర్తింపు రావడంతో ప్రేక్షకులే ఈ పేరును ఇచ్చారని శ్రీను చెప్పారు. “ఈ పేరు నేను పెట్టుకోలేదు.. ఎవరో పెట్టలేదు.. జనాలే పెట్టుకున్నారు” అంటూ ఆసక్తికరంగా స్పందించారు. ప్రభాస్తో ఉన్న అనుబంధం తనకు ఎంతో ప్రత్యేకమని, ఆ పేరు ఇప్పుడు తన కెరీర్లో ఒక గుర్తింపుగా మారిందని ప్రభాస్ శ్రీను తెలిపారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు