Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ.
- మంత్రి మార్పు కంటే పరీక్షల వ్యవస్థ సంస్కరణలపైనే కేంద్రం దృష్టి.
- ఎన్టీఏలో లోపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తోంది. రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని హెచ్చరిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన రాజీనామాను కోరుతున్నారు. అప్పుడే పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ ఈ రోజు కేంద్రంతో జరిగిన చర్చల్లో ధర్మేంద్ ప్రధాన్ రాజీనామాపై తగ్గేదే లేదని చెప్పింది. కేంద్రం దీనిపై రేపటి వరకు సమయం కోరింది.
ఇదిలా ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు, ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చే వ్యవస్థను మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. బీజేపీతో పాటు, కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా నిలుస్తున్నట్లు సమాచారం.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లోని లోపాలు, సమస్యలను గుర్తిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిపై ఒక సవివరమైన జాబితాను సిద్ధం చేస్తోందని, సమస్యల పరిష్కరించడానికి త్వరలో అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. పేపర్ లీక్ ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే పట్టుకున్నారు. దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ మాఫియా నెట్‌వర్క్‌పై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రాజీనామాల రాజకీయాలపై కాకుండా, దేశ పరీక్షా వ్యవస్థను పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చడంపైనే తమ దృష్టి ఉందని ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!