SWAG Theatrical Trailer: యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్ (Swag). హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా, దక్ష నగర్కర్, సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్, సునీల్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. దీంతో మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం నవ్వులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. శ్రీ విష్ణుకి ఈ సినిమా పక్కా హిట్ ఇవ్వబోతుందని తెలుస్తోంది.
Read Also: CM Chandrababu: పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కీలక సమీక్ష.. ఆ కేసుల్లో దర్యాప్తుపై ఆరా..
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. “మొన్ననే ఫ్రెంచ్ యువరాణిని ఏకాంతంగా కలిశాం” అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇందులో శ్రీ విష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మరోసారి అదరగొట్టారు. ఇందులో భవభూతి, యయాతి, కింగ్ భవభూతి, సింగ మొత్తం నాలుగు క్యారెక్టర్లలో శ్రీ విష్ణు కనిపించనున్నాడు. 1551లో మొదలైన ఈ కథ నేటి వరకు దాదాపు నాలుగు తరాలలో నడవనున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా స్వాగ్ సినిమా తీసినట్లు మనకు అర్థమవుతోంది. మొత్తం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించబోతుందని ప్రేక్షకులు అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Drinking Water: నీళ్లు తక్కువగా తాగుతున్నారా..? అయితే సమస్యే..!
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఆ తర్వాత హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖ కమెడియన్ సునీల్ కలర్ ఫోటో, పుష్ప లాంటి చిత్రాలలో విలన్ గా నటించి జనాల చేత మంచి మార్కులు వేయించుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా తన ట్రాక్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో సునీల్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. బాణం, సోలో వంటి చిత్రాలలో సహాయ నటుడిగా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ విష్ణు, 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో నటించి, ఆ తర్వాత ఏడాది సెకండ్ హ్యాండ్ చిత్రంలో నటించారు. 2016 లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు లభించింది. విశాఖపట్నం కి చెందిన ఆయన.. అక్కడే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా అందుకున్నారు.