Tirupati Laddu Controversy: దూకుడు పెంచిన సిట్.. నేడు లడ్డూ పోటు ఉద్యోగుల విచారణ..
- విచారణలో సిట్ దూకుడు..
- నిన్న మార్కెటింగ్ గోడౌన్లో రికార్డుల పరిశీలిన..
- ల్యాబ్ టెస్టింగ్ ప్రాసెస్ చెక్ చేసిన సిట్..
- ఇవాళ లడ్డూ పోటులో ఉద్యోగులను విచారించనున్న సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న జరిగిందన్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్.. వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న మూడోరోజు.. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్‌లో సిట్ టీమ్ తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్లలో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎలా భద్రపరుస్తారు.. వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయిన్టేన్ చేస్తారు.. అనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషీన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు.
Read Also: Jammu And Kashmir Polls: తుది దశ పోలింగ్ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది అభ్యర్థులు పోటీ!
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
అలాగే.. లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి శాంపిల్స్‌ను ఎలా టెస్ట్ చేస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్‌ను కూడా సిట్ సేకరించింది. టెస్టుల రిపోర్టులు రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది.. టెస్ట్ రిపోర్ట్‌లను ఎలా కలెక్ట్ చేస్తారు.. ఎలా రికార్డ్ చేస్తారనే అంశాలను సిట్ పరిశీలించింది. ఇక ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు. కాగా, నిన్న సుప్రీంకోర్టులో లడ్డూ వ్యవహారంపై విచారణ సాగగా.. లడ్డూకు వాడిన నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్ 18నాటి సీఎం ప్రకటనకు ఆధారం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన అంశమన్న న్యాయస్థానం.. ఇరువైపులా వాదనలు రికార్డ్ చేసి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో వైసీపీ నేతలు అధికార పక్షంపై ఘాటుగా స్పందించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!