Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Devotees Clash: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేసవి సెలవుల రద్దీ ఎఫెక్ట్ తగిలింది.. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో క్యూ లైన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొంతమంది భక్తులు సహనం కోల్పోతూ పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో సంయమనం పాటించాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని టిటిడి అధికారులు గతంలోనే భక్తులకు సూచించారు. అయితే కొంతమంది భక్తులు టిటిడి విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం వల్ల ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ఇక, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి పాలకమండలి సభ్యుడు సుదర్శన్ వేణు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 15వ తేదీ వరకు తన సిఫార్సు లేఖల కోటాను 50 శాతానికి తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అదనపు టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.8 కోట్లకు చేరగా, లడ్డు ప్రసాదం విక్రయాలు 4.15 లక్షలకు నమోదయ్యాయి. మరోవైపు అన్నప్రసాద వితరణ ద్వారా సుమారు 2.7 లక్షల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించినట్లు టిటిడి వెల్లడించింది. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారు సహనం పాటించాలని, టిటిడి అధికారులకు సహకరించాలని ఆలయ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!