Tirumala Brahmotsavam: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేట్ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రేపు (అక్టోబర్ 4వ తేదీ) నుంచి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేట్ వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. గరుడ సేవ సందర్భంగా 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్ వాహనాలకు ఘాట్ రోడ్లో అనుమతి నిరాకరించింది. అలాగే, 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12వ తేదీ వరకు ప్రైవేట్ వెహికిల్స్ పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే గరుడ సేవ రోజున ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహానాలు నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Marital Rape: వైవాహిక అత్యాచారాలపై కేంద్రం కీలక నిర్ణయం..
ఇక, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అని ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపు (శుక్రవారం) సాయంత్రం మీనా లగ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలు స్టార్ట్ అవుతాయి. అదే రోజు రాత్రి వాహన సేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి ఊరేగింపు చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.
Read Also: Pushpa 2: ‘పుష్ప 2’ కోసం భలే ఐటెం బ్యూటీని దింపుతున్నారే!
కాగా, రేపటి నుంచి స్టార్ట్ అయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి సేనాధిపతి అయిన విశ్వక్సేనులు వారు తిరుచ్చిపల్లకి పై ఊరేగుతూ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు పుట్టమన్ను, నవదాన్యాలను సేకరించి అంకురార్పణలో భాగంగా వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.