Tension in Punganur: పుంగనూరులో టెన్షన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ను పరామర్శించడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు ఛలో పుంగనూరు కార్యక్రమం తలపెడితే.. మరోవైపు గత ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన టోకన్స్ కు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటూ.. పుంగనూరులో బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. దీంతో ఎప్పుడూ ఎమీ జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.. దీంతో పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, సభలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.. కాగా, పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుంగునూరులో పలు ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Cyclone: ముంచుకొస్తున్న తుఫాన్.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం..
Also Read
మరోవైపు, ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు చెబుతున్నారు.. దాడిలో రూ.5 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని రామచంద్రయాదవ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కాగా.. మారణాయుధాలతో తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు, పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఆదివారం పోలీస్ 30యాక్ట్ ఉల్లఘించారని ఆయనతో పాటు 69మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇంటి వద్ద డీజే మైకు పెట్టారన్న ఫిర్యాదు మేరకు రామచంద్రయాదవ్, అతని డ్రైవర్‌పై.. ఇంటి వద్ద జనం గుమ్మిగూడరన్న మరో ఫిర్యాదుతో అనిల్, రమేశ్‌యాదవ్, రామచంద్రయాదవ్ పాటు 66మందిపైన ఇలా పలు కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..