తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి.. ఇక, సామాన్యుడికి అధికారం.. సామజిక సమన్యాయం దిశగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ).. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బీసీవై దూసుకెళ్తుంది.. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అభ్యర్థుల ఎంపిక సహా ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు.. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అత్యంత కీలకమైన “ఎన్నికల మేనిఫెస్టో”ను ఆ పార్టీ విడుదల చేసింది. 18 కీలక అంశాలతో రూపొందిన ఈ మేనిఫెస్టోలో…
Y+ Category to Ramachandra Yadav: ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ నుంచి రేపు పుంగనూరుకు చేరుకోనున్నారు భద్రతా సిబ్బంది… 2022 డిసెంబర్ 4వ తేదీన వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రైతు భేరి బహిరంగసభను అనుమతి లేకపోవడంతో అడ్డుకున్నారు పోలీసులు.. అదే రోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…
Off The Record: రామచంద్ర యాదవ్. 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వచ్చిన ఓట్లు 16 వేల 452. ఓడినప్పటికీ జనసేనకు దూరం జరిగి.. పుంగనూరు వేదికగా తన రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రామచంద్రయాదవ్ చేస్తున్న కార్యక్రమాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా మలుపులు తిరుగుతూ హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఒకసారి జాబ్‌మేళ అని మరోసారి యోగా గురువు రాందేవ్‌బాబాతో…
చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ను పరామర్శించడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు ఛలో పుంగనూరు కార్యక్రమం తలపెడితే.. మరోవైపు గత ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన టోకన్స్ కు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటూ.. పుంగనూరులో బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. దీంతో ఎప్పుడూ ఎమీ జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.. దీంతో పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, సభలకు…
Andhra Pradesh: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు పగిలిపోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సదుంలో రైతు భేరి నిర్వహిస్తామని చెప్పడంతోనే వైసీపీ శ్రేణులు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.…