శ్రీకాళహస్తిలో వెయ్యి పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాళహస్తి పరిధిలో వెయ్యి పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రికి జిల్లా యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి, ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద పదిఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు కానుంది తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి. వెయ్యిమంది రోగులకు ఆక్సిజన్ పడకలతో వైద్యం అందించేలా జర్మన్ షెడ్ల ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను గుర్తించిన తూర్పు నావికాదళం… శ్రీకాళహస్తి పైప్స్ సంస్థలోని ప్రాక్స్ ఎయిర్ ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను నావల్ డాక్ యార్డ్ బృందాలు సందర్శించాయి.
పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఆక్సిజన్ ను వైద్యఅవసరాల కోసం వినియోగించేలా… నిమిషానికి 16వేల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసేలా ప్లాంట్ లో అత్యాధునిక సాంకేతికతను ఏర్పాటు చేస్తుంది నావల్ డాక్ యార్డ్. పరిశ్రమ నుంచి కిలోమీటర్ వరకూ పైప్ లైన్ లు ఏర్పాటుచేసి ఆక్సిజన్ ఇవ్వొచ్చని తూర్పునావికా దళం నివేదిక ఆధారంగా పరిశ్రమ సమీప ప్రాంతాల్లో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాగం ప్రయత్నాలు చేస్తుంది. వెయ్యిపడకల తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ఏర్పడితే తిరుపతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. తిరుపతిలోని స్విమ్స్, రుయా కోవిడ్ ఆసుపత్రులకు పెద్దఎత్తున వస్తున్న రోగులతో విపరీతమైన ఒత్తిడి ఉన్న విషయం తెలిసిందే.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!