పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తా.. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించాలని చంద్రబాబు చెప్పారు.. తాను సరేనన్నానని పేర్కొన్నారు. చీపురుపల్లా ఎంపీనా.. లేక ఎచ్చెర్ల అనేది కాదు.. ఏం చెబితే అది చేస్తానన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ కొన్ని శక్తులు ఉంటాయి.. దాని గురించి తానేం మాట్లాడనని తెలిపారు. ఓసారి ముందు ప్రకటించొచ్చు.. ఓసారి చివర్లో ప్రకటన రావచ్చని…
ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అధినేతలు సైతం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు రాజకీయం మారిపోయింది. 2014 ఎన్నికల తర్వాత అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శిబిరంలో కొందరు… ఆయనంటే గిట్టని వారు మరో శిబిరంలో చేరిపోయారు. 2014లో టీడీపీ గెలిచాక.. జిల్లా ఇంఛార్జ్…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వంగవీటిరాధా ప్రాణాలకు ముప్పు ఉందని అతడు చెప్పినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరూ గన్‌మెన్‌లను పంపిచినప్పటికీ రాధా సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్‌నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ.. ఇప్పటివరకు…
జాతీయ ప్రాజెక్టైన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం.. సెకీ ఒప్పందం విషయంలో రివర్స్ టెండరింగుకు ఎందుకు వెళ్లడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కాయి.. అయినా రివర్స్ టెండరింగుకు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే.. రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారోననే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సోలార్ పవర్ కొనుగోళ్ల…
వైసీపీ పెద్దల చేతి వాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి అని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం అని గుర్తు చేసారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు ఉంచింది అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల…
మొన్నటి వరకూ ఆయన సైకిల్ పార్టీకి ఏపీ అధ్యక్షుడు. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాకాలోనే ఓ నేత కంట్లో నలుసులా మారారు. పార్టీలో నుంచి బహిష్కరించినా .. టీడీపీ జెండా వదలడం లేదట. కీలక నేతకు కునుకు లేకుండా చేస్తున్నారట. ఇప్పుడిదే హాట్ టాపిక్. కళాకు కంట్లో నలుసులా మారిన కలిశెట్టి! శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా లోకల్ పాలిటిక్స్ ఆసక్తిగా ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ…
ఏపీ సీఎం రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావ్. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది ప్రభుత్వ వైఖరి. ఆరువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. గతంలో దూరంగా ఉండి మా నిరసన తెలిపేవాళ్లం. ఈరోజు కలెక్టరేట్ గేటు వరకూ వచ్చాం…రేపు కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్తాం. ఎన్నికలు దగ్గరపడితే…
ఆయన మంత్రిగా.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదట. క్యాడర్ ఆయన్ను కలవాలన్నా అమరావతి.. లేకపోతే క్యాంప్ ఆఫీస్ అనేలా ఉండేది పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి అదే కారణమట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పోయినచోటే వెతుక్కోవాలని చూస్తున్నారు. పనిలో పనిగా కుమారుడిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు ఫార్ములాలు వర్కవుట్ చేసే పనిలో ఉన్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయంగా దూకుడు పెంచిన కళా వెంకట్రావు కళా వెంకట్రావ్.…